ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. బలమైన కథ, కథనంతో రూపొందిన హారర్, థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్లలోనే కాక, ఓటీటీల్లో కూడా గట్టి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఉత్కంఠభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రం, జెమినీ సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు జివికె ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, తాజాగా మధ్యప్రదేశ్‌లోని షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా ముగించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వార జిల్లాలో తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి అందమైన లొకేషన్లలో సుమారు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.
హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ ‘అమరావతికి ఆహ్వానం’ టైటిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు జివికె ఈ చిత్రాన్ని సమర్థవంతమైన హారర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తయిన తర్వాత, మధ్యప్రదేశ్‌లోని లొకేషన్లలో చిత్రీకరణ ముగిసింది. అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు జివికె మాట్లాడుతూ ‘అమరావతికి ఆహ్వానం’ సరికొత్త హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. వీఎఫ్ఎక్స్కు ఈ చిత్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ మూడ్‌ను అద్భుతంగా పెంచుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేశాం.