ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప
లో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. అంతేకాదు… 1.6 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గా ఈ మైలురాయిని చేరిన చిత్రంగా పుష్ప
నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప
ను గ్రాండ్ గా విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. దానికి తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేశారు. ఫహద్ ఫాజిల్ తొలిసారి ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా ప్యాండమిక్ సిట్యుయేషన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసిన నిర్మాతలు కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది. మరి స్టైలిష్ స్టార్ నుండి బన్నీని ఐకాన్ స్టార్ గా మార్చేసిన పుష్పరాజ్ రేపు థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గా పుష్ప మరో రికార్డ్!
