నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు.
వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదంతా బాలయ్యపై ప్రేక్షకులకు ఉన్న అభిమానం. బౌండెడ్ స్క్రిప్ట్ ఇస్తేనే సినిమా అంగీకరించని రోజుల్లో పదినిమిషాలు కథ విని అఖండ చెయ్యడానికి బాలయ్య ఒప్పుకున్నారు. బాలయ్య నాపై ఉంచిన అభిమానాన్ని భవిష్యత్తులో కూడా నిలబెట్టుకుంటాను. పరిపూర్ణమైన, పరిణతి చెందిన నటుడు బాలయ్య. ఈ సందర్భంగా అఖండ సినిమాలో డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు బాలకృష్ణ.
నన్ను మీ హృదయంలో ఎన్టీఆర్ కు ప్రతిరూపంగా చూసుకుంటున్నారు. రామకృష్ణ పేరుతో ఉన్న థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా ఉంది. అఖండ విజయాన్ని శతజయంతి జరుపుకుంటున్న కారణజన్ముడు ఎన్టీఆర్ కు అంకితమిస్తున్నాను అన్నారు బాలయ్య. ఎన్టీఆర్ చెయ్యని పాత్రలు లేవు. ఎన్టీఆర్ బిడ్డగా పుట్టడం అదృష్టం.నిర్మాతలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. నా ఆలోచనలు, బోయపాటి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి..బోయపాటి సినిమాలతో డైలాగులలో కొత్త ఒరవడి సృష్టించానన్నారు బాలయ్య. ధర్మం గాడి తప్పినప్పుడు దేవుడు మనిషి రూపంలో వస్తాడనేదే అఖండ సారాంశం. అఖండ సిమాని కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆదరించారు. ఈ జన్మలో నేను సంపాదించే అపురూపమైనది మీ అభిమానమే. కరోనాతో ఇబ్బందులలో ఉన్న సినిమా పరిశ్రమకు ఊపిరి ఇచ్చింది అఖండ సినిమా. చరిత్ర సృష్టించాలన్నా మేమే… తిరగరాయాలన్నా మేమే.
Cotton Price: బంగారంలా మెరిసిపోతున్న పత్తి