అడవి శేష్ ‘మేజర్’ సినిమాకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చింది. సాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లు కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా.
అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ మూవీ అమర జవాన్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన ‘26/11’ ముంబై ఉగ్ర దాడుల్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణ త్యాగం చేశాడు. మేజర్ ఉన్నికృష్ణన్ గా శేష్ నటిస్తోనన బయోపిక్ లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాల కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ కూడా ఉన్నారు. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ కి సిద్ధమవుతోన్న ‘మేజర్’ సాటిలైట్ హక్కులు సోనీ టీవీ దక్కించుకుంది. హీరో అడవి శేష్ కి ఈ సినిమానే బాలీవుడ్ లో డెబ్యూ మూవీ అయినప్పటికీ టెలివిజన్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడుపోయాయి!
‘మేజర్’ సినిమాకు సంబంధించిన ఓవర్ సీస్ రైట్ప్ గతంలోనే వీకెండ్ సినిమా, సౌత్ స్టార్ ఇంటర్నేషనల్ సంస్థలు భారీ ధరకు దక్కించుకున్నాయి. ఇప్పుడు హిందీ సాటిలైట్ రైట్స్ సోనీ సంస్థ దక్కించుకోవటంతో బయోపిక్ పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. చూడాలి మరి, సోనీ పిక్చర్స్ తో కలసి మహేశ్ బాబు నిర్మించిన పాట్రియాటిక్ మూవీ డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ విషయంలో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో!
డెబ్యూకి ముందే అడవి శేష్ మూవీకి ‘కోట్లాది రూపాయల’ క్రేజ్!
