డ్రగ్స్ వాడుతూ పోలీసులకు చిక్కిన నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆది సాయికుమార్ ‘బుర్రకథ’తో పాటు, ఇ, ఈ చిత్రంలో నటించిన నైరా షాను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. బోయ్ ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ తో జుహూలోని ఓ స్టార్ హోటల్ లో ఆమె చరస్ ను తీసుకుంటుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి నైరా షా జుహూలోని ఓ స్టార్ హోటల్ లో తన పుట్టిన రోజు పార్టీని ఇచ్చిందని, అక్కడ డ్రగ్స్ వాడుతున్న సమాచారం తమకు లభించడంతో సోమవారం తెల్లవారుఝామున 3 గంటలకు హోటల్ లోని గదిని సోదా చేయగా, ఒక గ్రామ్ చరస్ ను సిగరెట్ లో చుట్టి తీసుకోవడం గమనించామని పోలీసులు చెప్పారు. నైరా షా, ఆమె స్నేహితులకు ఏదైనా డ్రగ్ రాకెట్స్ తో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నామని అరెస్ట్ చేసిన శాంతక్రజ్ పోలీసులు అన్నారు. ఐపీసీ సెక్షన్ 274 ప్రకారం డ్రగ్స్ ను తయారు చేయడం, వాడటం, అమ్మడం, సరఫరా చేయడం, దాచడం నిషేధమని, వారి దగ్గర డ్రగ్స్ లభించడంతో అదే సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్ట్ అనంతరం కోర్టులో హాజరు చేయడానికి ముందు నైరా, ఆషిక్ లను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. నైరా శరీరంలో మోతాదుకు మించిన మత్తు పదార్థాలు ఉన్నాయని తెలిసిందన్నారు పోలీసులు. అయితే సోమవారం స్థానిక బాంద్రా కోర్టు నుండి నైరా షా బెయిల్ సంపాదించింది. దానితో వీరికి డ్రగ్స్ ఎలా లభ్యమయ్యాయనే దిశగా పోలీసులు పరిశోధన చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..