‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీకి నిర్మాత ఎస్ వీ ఆర్. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఎస్ బాలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీరశంకర్, అయన్, శృతి, రోషన్, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య సంగీతం అందిస్తున్నాడు.