ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సున్నితమైన అంశాలతో కూడిన ‘సమ్మేళనం’ అనే సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేస్తుంది.
ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించిన సమ్మేళనం సిరీస్ ను సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా తరుణ్ మహాదేవ్ నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ వెబ్ సిరీస్కు మంచి స్పందన వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ సిరీస్ను ఎటువంటి కమర్షియల్ హంగులకు వెళ్లకుండా చెప్పలను పాయింట్ ను చక్కగా తెరకెక్కించాడు. అడల్ట్ కంటెంట్, అడల్ట్ కామెడీ లేకుండా తెరక్కించిన విధానం మెచ్చుకోదగ్గ విషయం. చూస్తుంటే దర్శకుడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉండేలా ఉంది. అక్కడక్కడా కాస్త సాగతీసిన ఫైనల్ గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్ను తెరకెక్కించారు. మొదటి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికి కథలోకి వెళ్లేందుకు సమయం తీసుకున్న దర్శకుడు మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టించాడు. ఇక శ్రావణ్ జీ కుమార్ విజువల్స్ రిచ్ గా అనిపించాయి. శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ఈ సిరీస్ కు ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.