Site icon NTV Telugu

RK Roja: కేసీఆర్‌పై ఫైర్‌బ్రాండ్‌ ప్రశంసలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె.. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని కొనియాడిన ఆమె.. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు.. గతంతో పోలుస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారని.. ఈ కాలంలో ఏవరికి ఇలాంటి అవకాశం దక్కలేని పేర్కొన్నారు.. ఇక, భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు రోజా.. గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలి.. కాబట్టే సీఎం కేసీఆర్‌ అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగింది.. ఎందుకంటే ఇక్కడి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకువచ్చారని.. ఎప్పటికి తెలుగువారు అన్నదముళ్లు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని తెలిపారు.. తండ్రి సమానులైనా కేసీఆర్ సంతోషంగా ఉంటూ, ప్రజలను సంతోషంగా ఉంచేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.

Exit mobile version