RK Roja: కేసీఆర్‌పై ఫైర్‌బ్రాండ్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె.. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని కొనియాడిన ఆమె.. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు.. గతంతో పోలుస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారని.. ఈ కాలంలో ఏవరికి ఇలాంటి అవకాశం దక్కలేని పేర్కొన్నారు.. ఇక, భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు రోజా.. గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలి.. కాబట్టే సీఎం కేసీఆర్ అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగింది.. ఎందుకంటే ఇక్కడి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకువచ్చారని.. ఎప్పటికి తెలుగువారు అన్నదముళ్లు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని తెలిపారు.. తండ్రి సమానులైనా కేసీఆర్ సంతోషంగా ఉంటూ, ప్రజలను సంతోషంగా ఉంచేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.
Also Read
- Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
- Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?