NTV Telugu Site icon

YS Sharmila: తప్పులు చేస్తోన్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి..?

Ys Sharmila

Ys Sharmila

మరోసారి తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్‌లో రైతుగోస ధర్నాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిఅనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్‌ఎస్‌ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక, తప్పులు చేస్తున్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి అని ప్రశ్నించారు షర్మిల.. 17 లక్షల ఎకరాల్లో ధాన్యం వేయనీయనందుకు కేసీఆర్‌ని ఏ చీపురుతో కొట్టాలి..? రైతులను మోసం చేసిన కేసీఆర్ ని ఏ చెప్పులతో కొట్టాలి..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also: KTR: టీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకలు.. ఆహ్వానం ఉంటేనే రండి..

మరోవైపు, స్థానిక ఎమ్మెల్యే కొడుకు చేసిన అరాచకాలకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు వైఎస్‌ షర్మిల.. ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించిన ఆమె.. ఎమ్మెల్యే మీద, కొడుకు మీద చర్యలు తీసుకొనేందుకు మిమ్మల్ని ఏ చీపురుతో కొట్టాలి? అంటూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా, పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలు చేస్తూ వస్తున్న వైఎస్‌ షర్మిల.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే.