Site icon NTV Telugu

Ys Sharmila Padayatra: వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు షర్మిల. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు.

https://ntvtelugu.com/ap-schools-are-like-chiranjeevis-films-says-mla-madhusudan-reddy/

మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 4.15గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్ పల్లి చేరుకుంటారు. నార్కెట్ పల్లిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు మడ ఎడవెల్లి గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకుని అక్కడ ప్రజలతో మాట్లాడతారు.

Exit mobile version