Site icon NTV Telugu

Ys Sharmila: ఉప ఎన్నికలతో అభివృద్ధా? …సిగ్గుచేటు

Sharmila (1)

Sharmila (1)

తెలంగాణలో నేతల తీరుపై మండిపడ్డారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలో ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. మక్తల్ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించింది వైఎస్సార్టీపీ. పాదయాత్ర లో భాగంగా సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి కోసం పార్టీ మారినం అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయ్యింది..మునుగోడు లో ఇప్పుడు ఉప ఎన్నికలట..అభివృద్ధి కోసం ఆ ఎమ్మెల్యే బీజేపీ లోకి వెళ్తున్నాడట అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: ICICI Bank: ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ

బీజేపీలోకి వెళితే ఏం అభివృద్ధి జరుగుతుంది..? బీజేపీ పార్టీ ఎంపీ ఒకరు పసుపు బోర్డ్ తీసుకు వస్తా అని ఓట్లు వేయించుకున్నారు… తెచ్చాడా..? బీజేపీ పసుపు బోర్డ్ ఇవ్వకుండా ఏం అభివృద్ధి చేసినట్లు..? ఏం అభివృద్ధి జరుగుతుందని బీజేపీ లోకి వెళ్తున్నారు..? మీ రాజకీయాల కోసం… మీ కాంట్రాక్ట్ ల కోసం… స్వార్థం కోసం…లెక్కల మోసం..డబ్బుల కోసం పార్టీ లు మారుతున్నారు. మీకు సిగ్గు ఉండాలి కదా.. ఎవరి కోసం వస్తున్నాయి ఎన్నికలు? రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. మునుగోడు లో ఒక సర్పంచ్ ను కొనాలి అంటే కార్లు గిఫ్ట్ గా ఇచ్చి కొంటున్నారట.. సిగ్గు చేటు…వీళ్ళా రాజకీయ నాయకులు? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.జనం బాధలు వినేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకే ఈ పాదయాత్ర. ప్రజల కోసమే ప్రజాప్రస్థానం పుట్టిందన్నారు షర్మిల. ప్రజాప్రస్థానం 126వ రోజుకి చేరుకుంది.

Read Also: Etela Rajender: హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్

Exit mobile version