NTV Telugu Site icon

YS Sharmila: మరోసారి నిరంజన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్‌.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి..!

Ys Sharmila

Ys Sharmila

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల… మంత్రి నిరంజన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… నిన్న వైఎస్‌ షర్మిల చేసిన కామెంట్లకు ఇవాళ మంత్రి నిరంజన్‌రెడ్డి కౌంటర్‌ ఇస్తే… ఇక, ఇవాళ మరోసారి ఓ రేంజ్‌లో నిరంజన్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు షర్మిల.. వైఎస్సార్ ది రక్త చరిత్ర అని మాట్లాడాడు అంట.. అసలు వైఎస్సార్ చరిత్ర ఎంటో నిరంజన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు.. ఒక్క సారి కాదు.. లక్షా సార్లు మాట్లాడినా అబద్ధం నిజం అవ్వదని హితవుపలికిన ఆమె… వైఎస్సార్ ఐదేళ్ల పాలన చేస్తే ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసిన చరిత్ర ఆయనది అన్నారు.. సిగ్గుమాలిన నిరంజన్ రెడ్డి ఈ విషయాలు తెలుసుకోవాలని సూచించారు. సిగ్గు, ఇంగితం, బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం బ్రతుకు నిరంజన్ రెడ్డి.. లేకుంటే చీపురుతో కొట్టండి.. కర్రు కాల్చి వాత పెట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి.. ఈయనను మోసగాడు అనాలి అని పేర్కొన్నారు. ఇక, ఈ నెల 14 న 24 గంటల పాటు పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు వైఎస్‌ షర్మిల..

Read Also: KTR: నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. అదే కారణమని కేటీఆర్‌ ఫైర్‌

కాగా, గతంలో తనపై నిరంజన్‌రెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ.. గట్టిగా కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తనను మంగళవారం మరదలన్నాడని.. ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అంటూ ఫైరయ్యారు. ఈయనకు కుక్కకు ఏమైనా తేడా వుందా? అంటూ ప్రశ్నించిన ఆమె.. అధికార మదం తలకెక్కిందా… నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన నిరంజన్‌ రెడ్డి.. తెలంగాణలో కొందరు అహంకారంతో యాత్రలు చేస్తున్నారు.. అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో కిరాయికి పూలు చల్లించుకుంటూ.. కిరాయి మనుషులతో.. కిరాయి యాత్రలు చేస్తున్నారు అంటూ వైఎస్‌ షర్మిలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలోని కొన్ని శక్తులు తెలంగాణ మీదకు కొందరిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారున్ని.. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అంటూ ఫైర్‌ అయ్యారు.. వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని తాను అన్నారు.. ఇక, రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీచేసి నీ సత్తా ఏంటో చూయించు అంటూ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.