టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. గాయం అయ్యింది.. రెస్ట్‌లో ఉన్నాను అంటూ కేటీర్ ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశాం అన్నారు.. దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని.. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని మండిపడ్డారు.. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి.. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని షోలు, సినిమాలు చూస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.
ఓవైపు వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోరు.. మరోవైపు ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి చేశారు అని నిలదీసిన వైఎస్ షర్మిల.. ఇంట్లో నుంచి రిమోట్‌గా పని చేయలేరా? కరోనా సమయంలో మనమందరం పని చేయలేదా? ఇప్పుడు కేటీఆర్ అలా చేయవచ్చు కదా? అని మండిపడ్డారు.. వరదలొచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారు, ఇండ్లు కోల్పోయారు. వాళ్లకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఓటీటీ సినిమాలు చూస్తారట అంటూ దుయ్యబట్టారు.. ప్రజలకు ఏం హామీలిచ్చి అదికారంలోకి వచ్చారు, ఏ హామీలు నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఒక స్త్రీపై పై వ్యక్తిగతం విమర్శలు చేస్తున్నారు అంటూ ఘాటుగా రియాక్ట్ అయిన షర్మిల.. మీకు ఎలా అర్థమైందో ఏమో గానీ.. నాకైతే మండిందని వ్యాఖ్యానించారు..
YS Sharmila Latest Tweet about KTR
Get well soon @KTRTRS
Shows to watch for your pleasure:
Conspiracy Theory: the Cloud Burst,
&
Submerged Homes and Pump Houses https://t.co/pNuMhe4ujr— YS Sharmila (@realyssharmila) July 23, 2022
