Site icon NTV Telugu

Youth Marijuana Use: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. కుషాయిగూడలో ఘటన

Youth Marijuana Use

Youth Marijuana Use

Youth Marijuana Use: హైదరాబాద్ పాతబస్తీలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో ఉన్న అతడు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై దాడి చేసి 3 ఆటోలు, ఒక కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే.. నగరంలో మరోఘటన చోటుచేసుకుంది.

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ కాలనిలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. ఈ ముగ్గురు యువకులు గంజాయికి బానిసై సోనియాగాంధీ నగర్ కాలనిలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సోనియాగాంధీ నగర్ కాలనిలో గంజాయికి బానిసైన యువకులు కిరాణా షాపుల వద్దా వస్తున్న మహిళా విద్యార్థుల పట్లా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ముగ్గురు యువకులు. గురువారం అర్ధరాత్రి గంజాయి సేవించి మత్తులో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా నడి రోడ్డుపై దాడులు చేసుకున్నారు. సోనియాగాంధీ నగర్ కాలని వాసులు కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయి మత్తులో వున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గంజాయికి బానిసైన యువకులను చూసి మహిళలు చిన్నారులు తమ ఇండ్లలోనుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. కుషాయిగూడ పోలీసులు స్పందించి పోలీస్ పెట్రోలింగ్ ను గస్తీ ని పెంచాలని సోనియాగాంధీ నగర్ కాలని వాసులు రాచకొండ పోలీసులను వేడుకుంటున్నారు. కాలనీలో గంజాయి దందా ఎక్కడ కొనసాగుతోందో తెలియదు కానీ.. చాలా మంది యువకులు గంజాయి సేవించి ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుని కాలనీలో మళ్లీ ఇలాంటి గంజాయి దందా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read also: No Crop Holiday In Aqua Farming: ఆక్వా రైతుల కీలక నిర్ణయం.. నో క్రాప్ హాలిడే

ఈఏడాదిలోనే హైదరాబాద్​ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్​చల్‌ చేసిన విషయం తెలిసిందే. జిర్రా సమీపంలోని రాయల్స్​ హోటల్‌ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదే సమయంలో ముఠా సభ్యులు పోలీసు వాహనమెక్కి బీభత్సం సృష్టించారు. మత్తులో ఉన్న యువకులు పోలీస్‌ వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు.
Delhi: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం.. ఆఫీసుకు తాళం వేయాల్సిందిగా ఆదేశాలు

Exit mobile version