Youth Congress: తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంచెలంచెలుగా అసెంబ్లీకి రావడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Read also: Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
శాసనసభ ప్రారంభమైన వెంటనే కొద్ది నెలల క్రితం మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నాలుగు దశాబ్దాలుగా శాసనసభ్యునిగా, అనేక హోదాల్లో రాజకీయాల్లో పనిచేశానన్నారు. వ్యక్తిగతంగా తనకు మంచి అనుబంధం ఉందన్నారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటన్నారు.సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. పలు సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కంటోన్మెంట్లను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందన్న శుభవార్త తాజాగా అందిందని అన్నారు. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కూడా మాట్లాడారు.
Jagananna Suraksha : ముగిసిన జగనన్న సురక్షా క్యాంపైన్
