Youths who beat each other under the influence of alcohol: మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకులను చెదరగొట్టారు. ఈఘటన వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో చోటుచేసుకోవడంతో కలకలం రేపింది.
వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో యువకుల హల్ చల్ చేశారు. మద్యం మత్తులో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. మద్యం మత్తులో వున్న యువకులు నడిరోడ్డుపై రాగానే మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. చేతికి అందినదానితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మందుబాబులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక గత్యంతరం లేక మద్యం మత్తులో వున్న యువకులను చెదరగొట్టారు. ఎంత చెప్పిన వినకపోవడంతో.. పోలీసుల లాఠీకి పని పెట్టారు. యువకులు ఫుల్ గా మద్యం సేవించిన యువకులు మాట మాట పెరిగి ఈఘటనకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.
Read also: Chain Snacher: ఎల్‌బినగర్‌లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మహిళ మెడలో..
ఇక జనవరి 2023లో కొత్తసంవత్సరం వేడుకల్లో యువకులు రెచ్చిపోయారు. హైదరాబాద్-చంపాపేట్‌లోని నోవా ఫిష్టాలో కొంతమంది యువకులు నిర్వహించిన న్యూయర్ వేడుకలు శృతిమించాయి. యువకులు మద్యం మత్తులో ఒకరినొకరు విచక్షణారహితంగా.. బీర్ బాటిల్స్, కుర్చీలతో కొట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది.
Waltair Veerayya Movie Review: వాల్తేరు వీరయ్య