Waltair Veerayya Movie Review: వాల్తేరు వీరయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Chiranjeevi, Shruti Haasan, RaviTeja, Prakash Raj, Bobby Simha, Catherine Tresa, Rajendra Prasad, Nassar, SatyaRaj, Vennela Kishore
- DIRECTOR: K.Ravindra
- MUSIC: DeviSri Prasad
- PRODUCER: Naveen Yerneni, Y.RaviSankar
Waltair Veerayya Movie: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచీ తన ప్రతి చిత్రంలో ఇతర హీరోలతో కలసి నటిస్తూ సాగుతున్నారు. ‘ఖైదీ నంబర్ 150’లో తనయుడు రామ్ చరణ్ తో కాసేపు స్క్రీన్ పంచుకున్న చిరంజీవి, ఆ తరువాత అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటివారితో జోడీ కట్టి ‘సైరా…నరసింహారెడ్డి’లో అలరించారు. మొన్న ‘ఆచార్య’లో తనయుడు రామ్ చరణ్ తోనూ, తరువాత ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ తోనూ సాగారు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజతో కలసి నటించారు. రీఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలోనే ‘ఖైదీ నంబర్ 150’గా అలరించిన చిరంజీవి ఈ సారి పొంగల్ హంగామాలో ‘వాల్తేరు వీరయ్య’గా రావడంతో అభిమానుల్లో అంచనాలు అధికమయ్యాయి.
‘వాల్తేరు వీరయ్య’ కథ విషయానికి వస్తే… జాలారి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య మాటంటే అక్కడి వారికి వేదవాక్కు. కానీ, అతనికే తెలియకుండా కొందరు సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేస్తూంటారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ జాలరి పేటకు వెళ్ళి డ్రగ్స్ దందా చేసేవారిని అరెస్ట్ చేస్తాడు. అడ్డు వచ్చిన వీరయ్యనూ పట్టుకుపోతాడు విక్రమ్. నిజానికి వీరయ్య, విక్రమ్ ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరు. ఒకరికొరంటే అభిమానం ఉన్నా, తమ పరిస్థితుల కారణంగా దానిని బహిర్గతం చేయరు. ఈ డ్రగ్స్ దందాకు సాలమోన్ సీజర్ ముఖ్య సూత్రధారి. వీరయ్య కటకటాల వెనుక ఉన్న సమయంలో విక్రమ్ దుండగుల చేతుల్లో మరణిస్తాడు. తమ్ముడు చనిపోవడానికి అసలు కారకుడైన ప్రకాశ్ రాజ్ మలేసియా ఉన్నాడని తెలుసుకొని వీరయ్య అక్కడకు వెళ్తాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నదే కథ.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ప్రథమార్ధం చిరంజీవి ఎంటర్ టైన్ మెంట్ తో భళా అనిపించింది. ఆ తరువాత బ్రదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారు. రవితేజ పాత్ర నిడివి తక్కువే అయినా తన ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా ఉంది. ఇక శ్రుతి హాసన్ సీబీఐ ఆఫీసర్ గా వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన తారాగణమంతా తమ పాత్రలకు తగ్గట్టుగానే సాగారు. చిరంజీవి సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించి ట్యూన్స్ కంపోజ్ చేస్తారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే దేవిశ్రీ ఇందులోనూ బాణీలు కట్టారు. “బాస్ పార్టీ…” , “పూనకాలు లోడింగ్…” పాటలు నిజంగానే కిర్రెక్కించాయి. “నువ్వే శ్రీదేవైతే…నేనే చిరంజీవంటా…”, “నీకేమో అందమెక్కువ…” పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏ.యస్. ప్రకాశ్ రూపొందించిన సెట్స్ కనువిందు చేశాయి. దర్శకుడు కె.రవీంద్ర (బాబీ) కథలో పాత సినిమా పోకడలు కొన్ని కనిపిస్తాయి. సన్నివేశాల చిత్రీకరణలో బాబీ పట్టు చూపించారనే చెప్పాలి. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కథకు తగ్గ రీతిలో ఖర్చు చేశారు.
ప్లస్ పాయింట్స్:
– చిరంజీవి పంచిన వినోదం
– రవితేజ పాత్ర
– ఆకట్టుకొనే పాటలు
– మేకింగ్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉండడం
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: ‘లోడింగ్’ వీరయ్య!
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..