Site icon NTV Telugu

Breaking: డ్రగ్స్‌కు హైదరాబాద్‌ యువకుడి బలి.. ఇదే తొలి కేసు..!

పోలీసులు ఎంత నిఘా పెట్టిన గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ దందా సాగుతూనే ఉంది.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు.. విదేశాల నుంచి వచ్చిన వారు డ్రగ్స్‌తో సహా దొరికిపోయిన ఘటనలు అనేకం.. ఇక, డ్రగ్స్‌ కేసుల్లో ప్రముఖులను విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, హైదరాబాద్‌లో ఓ యువకుడు డ్రగ్స్‌తో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది.. గోవా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి.. డ్రగ్స్ తీసుకున్నాడు… అలా డ్రగ్స్ కు అలవాటు పడిన సదరు విద్యార్థి ముందుగా అస్వస్థతకు గురయ్యాడు.. అతడి పరిస్థితిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ వారంరోజుల్లోనే ఆ విద్యార్థి మృతిచెందాడు.. హైదరాబాద్‌లో డ్రగ్స్ తో మరణించిన తొలి కేసు ఇదే కావడంతో సంచలనంగా మారింది. ఇక, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. నిందితుడు ప్రేమ్‌తో పాటు మృతిచెందిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకొని అమ్మేవాడని పోలీసులు చెబుతున్నారు.

Read Also: Imran Khan: పాక్‌ ప్రధాని సంచలన ప్రతిపాదన..

Exit mobile version