Case on SI: యువకుడి ఆత్మహత్య.. ఎస్‌ఐపై కేసు నమోదు..

Ghanpur,

Ghanpur,

ఈ మధ్య తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, ఓ యువకుడి ఆత్మహత్యకు కారణం అంటూ ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు ములుగు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణం తీసింది. 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్‌వోసీ కోసం పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి యజమానిని అడిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షోరూమ్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Rajnath Singh: సరిహద్దులు దాటేందుకు వెనుకాడం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

×
×
Ad

దీంతో షోరూమ్ వద్ద ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక, తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్‌ ఏప్రిల్ 12వ తేదీన రాత్రి బండారుపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈ రోజు మరణించాడు.. ఇక, ప్రశాంత్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో, విచారణ చేసిన పోలీసులు.. షోరూం నిర్వహకుడిని ఏ1గా, ములుగు గణపురం ఎస్ఐని ఏ2గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.