NTV Telugu Site icon

Yadagirigutta: లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు తిరు కల్యాణ మహోత్సవం..

Yadagiri Gutta Bramhostavali

Yadagiri Gutta Bramhostavali

Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న జరిగే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవానికి కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన మండపం ఉత్తర ప్రాంతంలో వాయుమార్గంలో నిర్మించిన లిఫ్ట్‌, రథశాల ప్రాంతంలో కల్యాణ వేదికతోపాటు వీవీఐపీ, వీఐపీ, మీడియా, దాతలు, ఆలయ అధికారులు, దాతలు, కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. 3,500 మంది కూర్చోవడానికి. 3 అడుగుల ఎత్తు, 42 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవుతో కల్యాణ వేదికను రూపొందించారు. 10 వేల మంది స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వీలుగా కొండపైన 8 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఏరియాలో 4, తూర్పు మాదా వీధిలో ఒకటి, క్యూ కాంప్లెక్స్ పైన ఒకటి, కొండపై బస్టాండ్ ఏరియాలో 2 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తారు.

Read also: MLC Kavitha Husband Anil: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త..! మరి ఈడీ విచారణకు..?

బ్రహ్మోత్సవాలు ఇలా..

ఈ నెల ఇవాళ యాదాద్రిలో స్వామి వారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, ఛత్రతీర్థం నిర్వహించనున్నారు. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న ప్రధాన ఆలయ ఉత్తర ప్రాంతంలో నిర్మించిన లిప్టు, రథశాల ప్రాంతాల్లో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, మోకు సేవలను రద్దు చేశారు. , తిరు కల్యాణం మార్చి 19- ఉదయం శ్రీ మహా విష్ణు అలంకార సేవ, గరుడ వాహనసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం మార్చి 20- ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ సంగమం మార్చి 21- ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార నృత్య బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
RS Praveen Kumar: నేడు బీఆర్‌ఎస్‌ లోకి ఆర్‌ఎస్పీ.. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ..