Site icon NTV Telugu

Bhatti Vikramarka : పనులు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరిగిపోతుంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. మిగిలిన మూడు యూనిట్ల పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, రిపబ్లిక్ డే నాటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.

గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు, సమస్యల పరిష్కారంలో కూడా అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. పనులు ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఆర్ధికంగా భారితనాన్ని మోస్తుందని ఆయన పేర్కొన్నారు.

ENG vs IND: అందరికీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్‌లోకి వెళ్లాడు

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చొరవ తీసుకున్నందువల్లే రెండు యూనిట్లు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగలిగామని చెప్పారు. మిగిలిన యూనిట్లను కూడా తక్షణమే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వారి పిల్లలకు విద్యా, వైద్య సేవలు అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. అంతేకాక, ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు కూడా అత్యుత్తమ విద్యా, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో భూ నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వారికి న్యాయమైన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు ఆ బాధితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Trump Tariffs: భారత్‌కు 25 శాతం టారిఫ్.. పాకిస్తాన్‌కు మాత్రం ఊరట..

Exit mobile version