Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మారిందని చెప్పాలి. వారాంతంలో తెలంగాణ నుంచి లక్షలాది మంది యాదాద్రికి చేరుకుంటున్నారు. కొత్త ఆలయ దర్శనానికి కొంత మంది రాగా, మరికొందరు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తుస్నారు. గత కొద్ది రోజులుగా యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత ఇరవై ఎనిమిది రోజుల్లో యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Read also: Giorgia Meloni: నెట్టింట మళ్లీ ట్రెండింగ్ లోకి #Melodi.. బీచ్ లో ఇటలీ ప్రధాని
డిసెంబర్ నెలలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా.. జనవరి 1న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. యాదాద్రి ఆలయ హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు కొండ కింద ఉన్న ఆధ్యాత్మిక గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపంలో గత 28 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, ఆభరణాల కానుకలను గురువారం లెక్కించారు. ఆభరణాల రూపంలో రూ.3,15,05,035 నగదు, 100 గ్రాముల బంగారం, 4,250 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో రామకృష్ణారావు తెలిపారు. యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, నేపాల్, ఖతార్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఒమన్, మలేషియా దేశాల కరెన్సీ కూడా హుండీల ద్వారానే వచ్చినట్లు చెబుతున్నారు. నగదు ఆదాయం గతంలో రూ.2.5 కోట్లు కాగా ఈసారి రూ.3.15 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
World’s worst Rated Food: ప్రపంచంలోనే అత్యంత చెత్త ఆహారం ఏంటో తెలుసా?