NTV Telugu Site icon

Yadadri Temple: భక్తులకు అలర్ట్‌.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..

Yadadri Temple

Yadadri Temple

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు భక్తులకు షాకిచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈవిషయాన్ని ఆలయ ఈఓ భాస్కర్‌రావు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోని పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఆలయం అత్యంత ముఖ్యమైనది. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో గుర్తుండిపోయేలా ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలపై దేవస్థాన సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి కొండపై భక్తులు ఫోటోలు, వీడియోలు తీయకూడదని దీనిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో ఫ్యామిలీ ఫొటోలు దిగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వీటిని దృష్టిలో వుంచుకుని భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలని సూచించారు. అనుమతి లేకున్న ఫోటోలు, వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. దీనిని గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. యాదగిరిగుట్టపై అర ఎకరం భూమిని 4.03 ఎకరాలకు విస్తరించి ఆలయాన్ని నిర్మించారు.
Jagtial Crime: గంగారెడ్డి మర్డర్ కేసు.. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు..