Site icon NTV Telugu

TS REDCO: కేసీఆర్‌, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సతీష్‌రెడ్డి..

Y Satish Reddy

Y Satish Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ( TS REDCO) చైర్మన్‌గా నియమితులైన వై. సతీష్‌ రెడ్డి.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. తనను రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా నియమించినందకు ధన్యవాదాలు తెలిపారు.. కాగా, టీఎస్‌ రెడ్కో చైర్మన్‌గా వై స‌తీష్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుతం టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా ఉన్న ఆయనకు ప్రమోషన్‌ ఇచ్చారు కేసీఆర్.. ఇక, మూడేళ్ల పాటు రెడ్కో చైర్మన్‌గా కొనసాగనున్నారు సతీష్‌ రెడ్డి.. ఆయన స్వస్థలం ములుగు మండలం దేవగిరిపట్నం కాగా.. హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థలిపురంలో స్థిరపడ్డారు.. బీటెక్ చదివిన ఆయన.. విద్యార్థి నాయకుడిగా టీర్ఎస్‌లో చేరి.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు.. ఇక, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు.

Read Also: Biggest Banking Fraud: భారత్‌లో భారీ బ్యాంకు మోసం.. రూ.34,615 కోట్ల స్కామ్‌

Exit mobile version