Site icon NTV Telugu

Womens Day: మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు

ఈరోజు మహిళా దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు అధికారులు. మొట్టమొదటిసారిగా మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించారు. మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సిఐ కి బాధ్యతలు అప్పగించనున్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పి ఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి.

మహిళా సీఐ పేరు సీల్డ్ కవర్ లో సర్ప్రైజ్ గా ఉంచారు సిటీ పోలీస్ బాస్ సీవీ ఆనంద్. హోంమంత్రి మహమూద్ అలీ , సీపీ ఆనంద్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సిటీ పోలీసు మహిళా అధికారులందరూ హాజరుకానున్నారు.

https://ntvtelugu.com/womens-day-special-wishes/
Exit mobile version