కరీంనగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సానిటీజర్ తాగి వివాహిత దివ్య ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను అడ్డుకున్న కుటుంబ సభ్యులు… పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించారు. భర్త పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆందోళన చేస్తుంది. బాధితురాలికి తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు భర్త మురళీ కృష్ణ. 2007లో దివ్యకు తెలియకుండా సుజాతను వివాహం చేసుకున్నాడు మురళి కృష్ణ. 2017లో దివ్యను రెండో వివాహం చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నాడు. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం మురళి కృష్ణ ఇంటికి వెళ్లి గొడవ చేసారు రెండో భార్య బంధువులు. రేప్ చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మురళి కృష్ణ మొదటి భార్య.
కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం…
