Nayakudu: చాలా రోజుల తర్వాత ‘నాయకుడు’ కోసం రెహమాన్ ఫోక్ సాంగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘నాయకుడు’గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు లో జులై 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ఏఆర్ రెహమాన్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…
రెహమాన్ గారు… ‘నాయకుడు’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఎవరు మిమ్మల్ని సంప్రదించారు?
తొలుత ఉదయనిధి స్టాలిన్ గారు నన్ను సంప్రదించారు. ‘నాయకుడు’ సినిమాకు సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాకు నచ్చిన కథల్లో ఇదొకటి. కథ విన్నాక… సినిమా చేస్తానని చెప్పాను.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
‘నాయకుడు’ సినిమా మీ నుంచి ఏం డిమాండ్ చేసింది? ఎలాంటి మ్యూజిక్ కోరుకుంది? ప్రయోగాలు ఏమైనా చేశారా?
దర్శకుడు మారి సెల్వరాజ్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు మరింత మాస్ అప్పీల్ ఇచ్చారు. సంగీతం ఎక్కువ మందికి చేరువ అయ్యేలా ఉండాలనుకున్నారు. ప్రయోగాలు, కొత్తగా అంటే… చాలా రోజుల తర్వాత నేను జానపద తరహాలో గీతాలు చేశా. మ్యూజిక్ రాయల్ గా ఉండాలనుకున్నా.
ఉదయనిధి స్టాలిన్ మీ జానపద గీతాలకు ఎలా డ్యాన్స్ చేశారని అనిపించింది?
షూటింగ్ స్టార్ట్ చేయడానికి నెల ముందు నా దగ్గరకు వచ్చారు. తొలుత ఒక పాట చాలు అన్నారు. నేనూ ఒక పాట ఇచ్చాను. మిగతా పాటలకు షూటింగ్ చేశాక… బాణీలు అందించాను. ప్రతి పాటకు ఒక అర్థం ఉంటుంది.
మీరు ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. ‘జివ్వు జివ్వు…’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు!
(నవ్వుతు…) ఆ పాటకు ఫన్ టచ్ ఇవ్వాలని అనుకున్నా. సాంగ్ సిట్యువేషన్ మెచ్యూర్ గా ఉంటుంది. మాస్ అండ్ ఫన్ టచ్ కోసం అలా చేశా.
‘నాయకుడు’ సినిమా సంగీతం గురించి ఏం చెబుతారు?
ఉదయనిధి స్టాలిన్, మారి సెల్వరాజ్… ఇద్దరితో మొదటిసారి ‘నాయకుడు’ కోసం పని చేశా. ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇదొక టఫ్ సబ్జెక్టు. బాగా డీల్ చేశారు. ‘నాయకుడు’లో తండ్రీ కుమారుల మధ్య అనుబంధం ఉంటుంది. రాజకీయం ఉంటుంది.
నేపథ్య సంగీతానికి ఎంత స్కోప్ ఉంటుంది?
చాలా ఉంది. నేను 20 శాతమే ఎక్స్పెక్ట్ చేశా. కానీ, 80 పర్సెంట్ ఉంది. నేపథ్య సంగీతం బాగా వచ్చింది.
ఇటీవల మీరు ‘పొన్నియన్ సెల్వన్’కు సంగీతం అందించారు. అదొక చారిత్రక కథ. సంగీత దర్శకుడిగా సవాల్ విసిరే సినిమా అది. ‘నాయకుడు’ తరహా కమర్షియల్ కథలకు సంగీతం అందించేటప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి?
రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సమాజంలోని అసమానతలు, ఇంకా ఎన్నో విషయాల గురించి చర్చించారు. చాలా అంశాలపై మాట్లాడారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం ఓ కొత్త అనుభూతి.
‘నాయకుడు’ సంగీతానికి మీకు బెస్ట్ అప్రిషియేషన్ ఎవరి నుంచి వచ్చింది?
పాటలు చాలా మందికి నచ్చాయి. సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో పాట గురించి మాట్లాడారు. ఒక్కటి కాంప్లిమెంట్, అప్రిషియేషన్ అని చెప్పలేను.
సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ, మెలోడీ & లిరిక్ ఎప్పుడూ సేమ్. గత 35, 40 ఏళ్లుగా సేమ్ ఉంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే… సాంగ్ సింపుల్, క్యాచీగా ఉండాలి. బీట్ చేంజ్ అవుతుంది. మిక్సింగ్ చేంజ్ అవుతుంది. నా కోర్ కాన్సెప్ట్, మ్యూజిక్ కంపొజిషన్ థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ప్రేక్షకుల్లో, సమాజంలో మార్పులు వచ్చాయి. సంగీతంపై ఆ ప్రభావం ఉంటుంది.
ఆస్కార్ అవార్డుకు ముందు, తర్వాత అని రెహమాన్ లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగితే ఏం చెబుతారు?
నేను సేమ్ అండి. నాలో మార్పు ఏమీ రాలేదు. అయితే… ప్రపంచంలో మనకు ఇచ్చే గౌరవం పెరిగింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ మందికి తెలిసింది.
తాజావార్తలు
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?