Site icon NTV Telugu

Kanchanbagh Incident : మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి..

Dead Body

Dead Body

హైదరాబాద్‌లో మరో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మహిళను ప్రేమించమని వెంటపడి వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించడంతో పగ పెంచుకున్న ఆ ఉన్మాది ఒంటిరిగా వెళ్తున్న సదరు మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నూరా భాను అనే వివాహిత మహిళను హబీబ్‌ అనే వ్యక్తి గత సంవత్సరకాలంగా ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో.. అతడి ప్రేమను నిరాకరించింది నూరా భాను.

దీంతో.. హబీబ్‌ పగ పెంచుకొని.. శుక్రవారం రోడ్డుపై వెళ్తున్న నూరా భానుపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడడంతో.. నూరా భానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నూరా భానును చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version