Hyderabad: వాష్‌రూమ్‌లో కెమెరా.. తరువాత ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో స్త్రీలకు భద్రత రోజురోజుకు కరువైపోతోంది. స్కూల్‌లో, కాలేజీలు, పనిచేసే దగ్గర ఇలా ప్రతి చోటా కామాంధులు మాటేసుకొని కూర్చున్నారు. సందు దొరికితే చాలు తమలో ఉన్న కామాంధుడుకి పని చెప్పి రాక్షసానందం పొందుతున్నారు. అధికారులు శిక్షలు విధిస్తున్న ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు.
అలాంటి ఘటనే ఇది.. మహిళలు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియోలు చిత్రీకరించి, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దాస్.. రోడ్ నం.92లోని ఓ బోటిక్‌లో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే బోటిక్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో ఎవరికీ తెలియకుండా.. తన సెల్‌ఫోన్‌ను వీడియో మోడ్‌లో ఉంచాడు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
దీంతో బోటిక్‌లో పని చేస్తున్న మహిళలు.. వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ దృశ్యాలు మొబైల్‌లో రికార్డు అయ్యాయి. ఇలా మిథున్ దాస్ పదుల సంఖ్యలో మహిళల వీడియోలను చిత్రీకరించి భద్రపరుచుకున్నాడు. అయితే బోటిక్‌లో పని చేసి మానేసిన చేసిన ఓ మహిళ ఫోన్‌కు మూడు రోజుల క్రితం ఓ వీడియోను పంపాడు.
ఆ వీడియోను చూసి ఆమె షాక్‌కు గురైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిథున్ దాస్ ఫోన్ నుంచి తనకు వీడియో రావడంతో.. నేరుగా అతన్నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్‌లో వేరే మహిళలకు సంబంధించిన మరిన్ని వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!