Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Woman Kills 4 Year Old Daughter Over Extra Marital Affair In Kushaiguda

Extramarital Affair: దారుణం.. ఆపనికి అడ్డుగా ఉందని కూతుర్ని హత్య చేసిన తల్లి

Published Date :July 12, 2023 , 9:19 am
By NTV WebDesk
Extramarital Affair: దారుణం.. ఆపనికి అడ్డుగా ఉందని కూతుర్ని హత్య చేసిన తల్లి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Extramarital Affair: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎలాంటి లోటు లేకుండా అల్లారముద్దుగా పెంచుకుంటారు. తమ కోరికలు, ఇష్టాలను చంపుకొని మరీ.. పిల్లల అలనాపాలనా చూసుకుంటారు. కానీ.. ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నీచానికి పాల్పడింది. కేవలం ‘కామలీలల’ కోసం కన్నకూతురినే తన చేతులతో చంపింది. ఆపై.. తాను చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, సరికొత్త డ్రామాకు తెరతీసి, తనకేమీ తెలియదన్నట్టుగా ‘మహానటి’ని మించి నటించింది. చివరికి తాను చేసిన పాపానికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

Read also: Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి

కుషాయిగూడలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో సంచలనం వెలుగులోకి వచ్చింది. బాలికను తల్లి కల్యాణే హత్య చేసినట్లు తేలింది. తండ్రి అనుమానం నిజమైంది. నిందితురాలికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, దానిని తన కూతురు అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న నాలుగున్నరేళ్ల బాలికను దిండుతో కప్పి ఊపిరాడకుండా చేసి తన్విత హత్య చేసింది. పోలీసుల విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. ఈ నెల 1వ తేదీ (శనివారం) మధ్యాహ్నం తన్విత స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు ఆడుకుని పడుకుంది. కూరగాయల మార్కెట్‌లో పనిచేసే తల్లి కళ్యాణి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు నిద్రిస్తోంది. ఫోన్ చేసినా నిద్ర లేవకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిద్రిస్తున్న కూతురు నిద్రలోనే మృతి చెందిందని కల్యాణి కన్నీరుమున్నీరైంది. ఆమె తన పొరుగువారిని, బంధువులను తెలిపింది. అయితే కూతురు మృతి పట్ల భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త రమేష్ జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read also: Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. రూ.5 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్

ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు చిన్నారి తల్లి కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన కూతురిని తానే హత్య చేసినట్లు అంగీకరించింది. కాప్రా సర్కిల్‌ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్‌ వెనుక వీధిలో నివాసముంటున్న నాయిక్‌వాడి రమేష్‌ కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కల్యాణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తన్విత (4 సంవత్సరాల 6 నెలలు) అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి విడివిడిగా ఉంటున్నారు.కళ్యాణి కూతురిని తీసుకుని కుషాయిగూడలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. పాప స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. భర్త నుంచి విడిపోయిన కళ్యాణికి స్థానికంగా ఉన్న మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పాప అడ్డుగా ఉందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టింది. చిన్నారిని ఊపిరాడకుండా చేసి, నిద్రలోనే చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పాలివ్వాల్సిన తల్లి నిద్రపోతే చంపేస్తుందని ఆ చిన్నారి ఎలా ఊహించగలదు.
Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • extra marital affair
  • Kushaiguda
  • kushaiguda girl death
  • mother kills daughter
  • woman kills daughter in hyderabad

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions