Leopard Attack: ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు సంచరిస్తుండడంతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా శనివారం ఉదయం బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో తన ఇంటి బయట కాలకృత్యాల కోసం వెళ్లిన మహిళపై చిరుత ఒక్కసారిగి దాడి చేసింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగునవచ్చారు. స్థానికులు వచ్చి ఆమెను రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కంటికి తీవ్ర గాయమై తీవ్రంగా రక్తస్రావం అయింది.
Read also: Jamili Elections: ఈనెల 16న లోక్‌సభ ముందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లు
వెంటనే ఆమెను ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటవీ శాఖ వైద్య ఖర్చుల కోసం తక్షణ సహాయాన్ని అందించింది. సిబ్బంది ఆమె ఆరోగ్య పరిస్థితిని ట్రాక్ చేస్తున్నారు. అడవికి సమీపంలోని షెడ్డులో ఉన్న పశువులను చంపేందుకు చిరుత వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
Read also: CM Chandrababu: జమిలీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలు మాత్రం అప్పుడే..!
జిల్లాలోని అడవుల్లో కనీసం 13 చిరుతలు నివాసం ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా అడవుల్లోనే పశువులను చంపేస్తాయని అధికారులు తెలిపారు. కాగా..నవంబర్ 29న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసగావ్ గ్రామంలో పత్తి పంట కోసే పనిలో నిమగ్నమై ఉన్న మోర్లె లక్ష్మి (21)ని పులి దాడి చేసి చంపింది. నవంబర్ 30న సిర్పూర్ (టి) మండలం దుబ్బగూడెం గ్రామంలో రైతు రౌతు సురేష్‌పై అదే పులి దాడి చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
Crime News: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్, 8 మంది అరెస్ట్