Rajendranagar Crime: ఈ కాలంలో మనిషి చంద్రుడిపై కాలు మోపడమే కాకుండా అక్కడే ఉండేందుకు సిద్ధమవుతున్నాడని కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాలపై నమ్మకంతో జంతుబలులు, నరబలులు చేస్తారు. తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
Read also: Nama Nageswara Rao: ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు
అత్తాపూర్‌లో శివాని అనే మహిళ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. మంగళవారం ఉదయం రోడ్డుపైకి వచ్చిన మెట్రో పిల్లర్ నంబర్ 133 వద్ద శివాని ఒక్కసారిగా తన చేతుల్లో వున్న పెట్రోల్ సీసాను తీసుకుని ఒంటిపై పోసుకుంది. అక్కడే వున్న వారికి అసలు ఏం జరుగుతుందో ఎరికి అర్థం కాలేదు. అయితే అక్కడ ఆమె తన దగ్గరే వున్న అగ్గిపెట్టితో తాను నిప్పంటించుకుంది. దేవుడు చెప్పాడంటూ నిప్పుపెట్టుకోవడం సంచలనంగా మారింది. ఊహించని ఈ ఘటనతో షాక్‌కు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, SSI శ్వేత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో శివాని గట్టిగా కేకలు వేస్తూ దేవుడు చెప్పాడు అంటూనే కాలిపోతుండటం చూసిన పోలీసులు ఆమెను వెంటనే 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇలాంటి మూఢనమ్మకాలకు బానిసై జీవితాలను సర్వనాషనం చేసుకోకండి అని పోలీసులు సూచించారు. అసలు ఆ మహిళ చేతిలో పెట్రోల్ ఎలా వచ్చింది? ఎందుకు ఆమె అకస్మాత్తుగా దేవుడు చెప్పాడు అంటూ నిప్పంటించుకుంది అని ఆరా తీస్తున్నారు. అత్తాపూర్ లో ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.