NTV Telugu Site icon

Kamareddy Crime: వీడిన త్రీ సూసైడ్స్ మిస్టరీ.. అందుకే ఆ ముగ్గురు మృతి..

Si Saikumar

Si Saikumar

Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్‌ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలు వెల్లడించినట్లు సమాచారం.

Read also: Donald Trump On Tiktalk: టిక్‌టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?

మొదటగా ఆత్మహత్య చేసుకోవడానికి శృతి చెరువులో దూకింది. శృతి తర్వాత దూకిన నిఖిల్, ఈత రాకపోవడంతో నిఖిల్ గల్లంతు. శృతి కాపాడమని అడగడంతో ఎస్సై సాయి కుమార్ చెరువులోకి దూకాడు. చెరువు పెద్దది కావడం తో సాయి కుమార్ నీట మునిగారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ముగ్గురు మృతి. కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయికుమార్‌, ఆపరేటర్‌ నిఖిల్‌ ఇద్దరు చెరువులోకి దూకినట్లు పోలీసులు గుర్తించారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు రహదారి పొడవునా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. 25వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 1.26 గంటలకు ముగ్గురి సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు నిర్ధారణ అయింది. ముగ్గురూ ఒకేసారి నీటిలో మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు.
Liquor Sales: మందు బాబులకు గుడ్‌ న్యూస్‌.. డిసెంబర్ 31న ఆ టైం వరకే అనుమతి..