డబ్బులు ఎలా సంపాదించాలి.. దానికి కష్టపడటం అవసరమా.. దొంగతనం, ఎవరినైనా కిడ్నిప్ చేస్తే డబ్బులు బాగా సంపాదించచ్చు కదా. అవసరానికి మన చేతిలో డబ్బుంటుంది. ఇలాంటి అతి తెలివితేటలతో వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు. డబ్బు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు అక్రమార్కులు. జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి అక్రమంగా డబ్బు సంపాదిచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలో.. చైన్ స్నాచింగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ దందా, వ్యభిచారం, కిడ్నాప్స్ లాంటి వాటికి తెగబడుతున్నారు. తాజాగా.. కరీంనగర్ జిల్లాలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది.
కరీంనగర్ జిల్లాలో వీక్లీమార్కెట్ కు చిన్నారిని తీసుకుని తల్లి రాత్రి 7 గంటల సమయంలో వెల్లింది. అయితే.. చిన్నారిని ఇదే అలుసుగా భావించిన ఓ ఆటో డ్రైవర్ ఆచిన్నారిని కిడ్నాప్ చేసాడు. అయితే తల్లి చిన్నారి లేకపోవడంతో.. స్థానిక యువకులతో.. చిన్నారికోసం వెతికింది. అయినా జాడ కనిపించకపోవడంతో.. రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖాజీపూర్ లో పాప వుందని సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలో తనిఖీలు చేసారు. అర్ధరాత్రి ఆటో డ్రైవర్ ను కిడ్నాప్ అయిన పాపను సుభాష్ నగర్ లో గుర్తించారు. సుమారు 6 గంటల వ్యవధిలో కిడ్నప్ అయిన పాపను కిడ్నాపర్ చెరనుంచి విడిపించి, తల్లిదండ్రులుకు అప్పగించారు పోలీసులు. చిన్నారిని కిడ్నాపర్ నుంచి సురక్షితంగా గంటల వ్యవధిలోనే స్పందించి తల్లిదండ్రులకు అప్పగించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు సిఐలు నటేష్, దామోదర్ ను స్థానికులు ప్రశంసలు కురిపించారు.
Raptadu Politics : రాప్తాడులో సీమ టపాకాయలు..వైసీపీ, టీడీపీ నేతల మధ్య వార్నింగ్స్
