Vijayashanti: ఈరోజే బీజేపీ లిస్టు.. రాములమ్మ పేరు ఉంటుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti: సినిమాల్లో లాగా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం చేయకూడదు.. ఒక్క పార్టీ కోసమే పనిచేయాలి.. ఇది ఎవరి మాటలు కాదు.. మన రాములమ్మ చెప్పిన సత్యం. మరి ఈ మాటల వెనుక రహస్యం ఏంటని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో గళం విప్పిన విజయశాంతి ఎక్కువగా సోషల్ మీడియా వేదికలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో విజయశాంతిపై ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు అంటూ విజయశాంతి చేసిన ట్విట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. రెండు అభిప్రాయాలు మన తెలంగాణ మేలు కోసమే. అయితే పోలీసు లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లాంటి సినిమా తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం. హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై తెలంగాణ’ అని విజయశాంతి తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
అయితే విజయశాంతి మాటల వెనుక అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ రాష్ట్ర నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలో రాములమ్మ పేరు లేదు. ఇటీవల మోదీ రాష్ట్రానికి వచ్చిన సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం గమనార్హం. ఒకవేళ కట్ చేస్తే..అధికారం ఆదేశిస్తే.. కేసీఆర్ పై కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటన కూడా ఇచ్చారు.. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ విడుదల చేసే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంతా ఓకే అయితే.. కాకపోతే.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని బీజేపీ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇవాల్టి జాబితాలో పేరు ఉంటుందా.. లేదా..!? చూద్దాం..
Balaiah: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం… ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!