NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తా.. మరీ కాంగ్రెస్ నుంచేనా..?

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy: పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త డిసిసి అధ్యక్షులను, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్ఠానం నియమించింది. ఈ రెండు కమిటీల్లో పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. దీంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ గట్టి షాక్‌ ఇచ్చినట్టైంది. కొత్త పీసీసీ కమిటీలో చాలా మందికి చోటు దక్కింది కానీ ఏ కమిటీలోనూ కాంగ్రెస్‌ పార్టీలో మోస్ట్‌ సీనియర్‌ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం దక్కకపోవడం విస్మయం కలిగిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్. అయితే ఇప్పుడు ఆ స్థానం కూడా దక్కలేదు. ఏఐసీసీ కూడా పలు కమిటీలను ప్రకటించినా ఒక్కదానిలోనూ కోమటిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనికి కారణం ఇటీవల జరిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిమునుగోడు ఉపఎన్నిక ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి.. మునుగోడులో ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలోకి దిగారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం సాధించింది.. అయితే, కాంగ్రెస్‌ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముందుకు రాలేదు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

Read also: Pushpa 2: ఎట్టకేలకు పుష్ప-2ను పట్టాలెక్కిస్తున్నారట..?

బహిరంగసభలు పెట్టినా.. ఆయన హాజరుకాలేదు.. ఇదే, సమయంలో.. పార్టీ చూడకుండా తన సోదరుడికి ఓటు వేయాలంటూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన ఓ ఆడియో సోషల్‌ మీడియాకు ఎక్కింది.. త్వరలోనే నేను పీసీసీ చీఫ్‌ను అవుతానని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని.. అప్పుడు ఏదైనా ఉంటే చూసుకుంటానని.. ఓ కాంగ్రెస్‌ కార్యకర్తకు హామీ ఇచ్చారు.. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన.. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ గెలిచేది లేదని ఎన్నికలకు ముందే తేల్చేశారు.. ఆ వీడియో కూడా వైరల్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారం అధిష్టానం దృష్టి వరకు వెళ్లడం.. ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది.. అయితే, ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలనేది ఎన్నికలకు నెలరోజుల ముందు చెబుతానంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచళనంగా మారింది. దీంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ కోమటి రెడ్డికి  షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో గత కొంతకాలంగా నియోజకవర్గం తప్ప మిగతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటి రెడ్డి.

వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండే పోటీ చేస్తా:

అయితే కమిటీ ప్రకటనలో కోమటి రెడ్డి పేరు లేకపోవడంతో చర్చకు దారితీస్తున్న సమయంలో నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండే పోటీ చేస్తా అంటూ శపథం చేశారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో హై పవర్ కమిటీలు చాలా వున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికే రాజీనామా చేశా! నాకు పదవులు ముఖ్యం కాదని కోమటి రెడ్డి తెలిపారు. పేదలు, కార్యకర్తలు నాకు ముఖ్యం అంటూ పేర్కొన్నారు. రాజకీయాలు మాట్లాడను, ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాలు మాట్లాడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. కొద్ది రోజులుగా అసహనంతో ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. అయితే నల్లగొండ నుంచే పోటీ చేస్తా అని మీడియా ముఖంగా చెప్పడంతో చర్చకు దారితీస్తోంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతారా? కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేస్తారా? లేక పార్టీ మారుతారా? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది.
Suicide Attempt : రెండో భర్త నన్ను వద్దంటున్నాడు.. నేను సచ్చిపోతా..!