Hyderabad: మద్యంలో విషం కలిపి భర్తతో తాగించింది.. ప్రియుడితో చెక్కేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: సాఫీగా సాగిపోతున్న జీవితాలను వివాహేతర సంబంధాలు నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల పవిత్ర బంధంపై అక్రమ సంబంధం పైచేయి సాధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. బాయ్‌ఫ్రెండ్స్ కోసం భర్తను చంపేందుకు పిల్లలను వదిలించుకోవడానికి కొందరు మహిళలు ఎంతగా దిగజారేందుకు వెనుకాడటం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్య ప్రియుడి మోజులోపడి భర్తనే కడతేర్చింది. భార్యాభర్తల బంధానికి మచ్చలాంటి ఈ ఘటన హైదరాబాద్ శివారులో వెలుగు చూసింది.
Read also: Manipur: మణిపూర్ మహిళలతో అసభ్య ప్రవర్తన.. నిందితుడి ఇంటికి నిప్పు
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో కొత్తగొల్ల తుక్కప్ప, ఈశ్వరమ్మ దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. తుక్కప్ప కొంతకాలంగా పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ మంచాన పడ్డాడు. దీంతో అతని భార్య ఈశ్వరమ్మ అదే కాలనీలో ఉంటున్న శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా కాలంగా కొనసాగుతున్న వీరి అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకాంతంగా వుండగా ఈశ్వరమ్మ, శ్రీనివాస్ లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. దీంతో తుక్కప్ప, ఈశ్వరమ్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈశ్వరమ్మకు తుక్కప్ప మరోసారి ఇలా జరిగితే బాగుండదని హెచ్చరించాడు. దీంతో ఈశ్వరమ్మ ఆగ్రహానికి లోనైంది. తుక్కప్పను హతమార్చాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. అనారోగ్యంతో వున్న తుక్కప్పను మద్యంలో విషం కలిపి ఇచ్చింది.
Read also: Weight Loss Tips: ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేసినా చాలు.. ఇట్టే బరువు తగ్గుతారు!
అదిగమనించిని తుక్కప్ప మందును తాగి కిందకు పడిపోయాడు. దీంతో ఈశ్వరమ్మ ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారయ్యింది. తుక్కప్పను గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న తుక్కప్పను గుర్తించిన ఘట్ కేసర్ పోలీసులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. తుక్కప్ప మృతి చెందిన తర్వాత అతని భార్య ఈశ్వరమ్మ కనిపించకపోవడంతో ఈ పని చేసి ఉంటుందని అనుమానం బలపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న(గురువారం) ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.
Rangareddy: నవీన్ స్టోరీ మళ్లీ రిపీట్.. ప్రియురాలి కోసం స్నేహితున్ని చంపేశాడు
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!