NTV Telugu Site icon

Bandi Sanjay: బాసర విద్యార్థులపై ఎందుకు కక్ష..? విద్యార్థులంటే కేసీఆర్ కు పడదా..?

Basara Iiit, Bandi Sanjay

Basara Iiit, Bandi Sanjay

బాసర విద్యార్థులపై ఎందుకు కక్ష.. విద్యార్థులంటే కేసీఆర్ కు పడదా? అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండి పడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రెండు సార్లు యాత్రలు సక్సెస్ అయ్యామని, కేంద్ర మంత్రులు నాయకులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇలవేల్పు అయిన యాదాద్రి నుండి మూడో ప్రజా సంగ్రామ యాత్ర మొదలై 5 జిల్లాలు 12 శాసనసభ స్థానాల్లో కొనసాగుతుందని ప్రకటించారు. బాసర విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రికి విద్యార్థులు బాధలు తెలియట్లేదని విమర్శించారు.

read also: Monkeypox: మంకీపాక్స్‌ వ్యాప్తితో న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ విధింపు

బాసర విద్యార్థులపై ఎందుకు కక్షనో అర్థం కావట్లేదని ఆవేదన చేసారు. గురుకుల పాఠశాలలో పురుగులు అన్నం నీళ్లు పోసి సాంబారు పెడుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంటే కేసీఆర్ పడదని విమర్శించారు. బాసరలో విద్యార్థులు తిండి కోసం అడుగుతుంటే.. మంత్రులు వెళ్లి హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంటే.. ఢిల్లీ పోయి ఏమి చేసినవ్ కేసీఆర్ ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థులకు తిండి పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ? ప్రశ్నించారు. కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ట్రిబుల్ ఐటి విద్యార్థులను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని భోజనం పెట్టి సమస్యలు తెలుసుకో అని విమర్శించారు. బాసర విద్యార్థులు కోసం ఎవరు వెళ్లినా అరెస్ట్ చేస్తావ్ బెదిరిస్తావ్ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రినే ఢిల్లీ పారిపోయినవ్.. మా పరిస్థితి ఏంటని మిగతా నాయకులు దిగాలు పడుతున్నారని ఎద్దేవ చేసారు. కేసీఆర్ డిల్లీ ఎందుకు పోయాడో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.

Kadali Jaya Saradhi: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత…