Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేటితో ముగియనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు.. నిన్న ఒక్కరోజే 7980 మంది అభ్యర్థులు 8,326 నామినేషన్లు దాఖలు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు..

* నేడు ఢిల్లీలో జల వివాదాల కమిటీ తొలి సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన భేటీ.. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై చర్చించనున్న కమిటీ.. సమావేశానికి హాజరు కానున్న ఏపీ, తెలంగాణ అధికారులు..

* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ తదుపరి తేదీని సిట్ ప్రకటించే అవకాశం..

* నేడు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నేతృత్వంలో ఎన్నికలు.. బరిలో 203 మంది న్యాయవాదులు, 55 మంది మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లుగా 35,316 మంది న్యాయవాదులు..

* నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు గుడు పల్లె మండలంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమిపూజ.. కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం.. కంగుందిలో హెరిటేజ్ సైట్ డెవలప్మెంట్ వర్క్స్ అండ్ బౌల్డరింగ్ పార్క్ ప్రారంభం.. కంగుందిలోనే వంద అడుగుల ఎత్తయిన జాతీయ జెండా ఆవిష్కరణ.. శాంతిపురం మండలం కడపల్లెలోని ఇంటికి చేరిక..

* నేడు రెండు రోజు విశాఖ పర్యటనలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇవాళ అరకు ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం.. రేపు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష.. విశాఖలో వాయు, జల కాలుష్యం నివారణ చర్యలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇతర విభాగాలతో భేటీ..

* నేడు తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

* నేడు కాకినాడకు మంత్రి నారా లోకేష్.. JUTUKలో హాస్టల్ ను ప్రారంభించనున్న మంత్రి లోకేష్.. అనంతరం కోరమాండల్ కంపెనీ ఆస్పత్రి భవనాలను ప్రారంభించనున్న లోకేష్.. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్..

* నేడు అనకాపల్లి ఉత్సవ్.. అచ్చుతాపురం మండలం కొండకర్ల ఆవ దగ్గర ఉత్సవాలు ప్రారంభం.. హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు..

* నేడు విశాఖలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన.. జీవీఎంసీ విగ్రహం దగ్గర నివాళులు ఆర్పించి దీక్ష ప్రారంభించనున్న విపక్షం.. గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీ..

* నేడు వైసీపీ అధ్వర్యంలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం.. తిరుమల లడ్డులో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..

* నేటితో ముగియనున్న రఘువీరారెడ్డి గాంధీ సందేశ యాత్ర.. హిందూపురంలో పాదయాత్ర ముగింపు, బహిరంగ సభ..

* నేటితో ముగిసిన ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్.. ఈరోజు ఏసీబీ కోర్టులో నిందితులను హాజరు పర్చనున్న పోలీసులు..

* నేడు డబ్ల్యూపీఎల్ లో ముంబై వర్సెస్ గుజరాత్ మధ్య పోరు.. వడొదరలో రాత్రి 7 గంటలకు మ్యాచ్..

Exit mobile version