Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు రెండో రోజు దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన.. ఐబీఎం, గూగుల్ క్లౌట్ వంటి సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేలా రౌండ్ టేబుల్ సమావేశాలు..

* నేడు పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు.. జంట హత్యల కేసులో జైలులో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్.. మూడు రోజుల పాటు కస్టడీలో విచారణ చేయనున్న పోలీసులు..

* నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం.. వాసవి పెనుగొండలో భారీగా ఏర్పాట్లు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం..

* నేడు హుజుర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేతలతో సమావేశం..

* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సంగారెడ్డి, జోగిపేట మున్సిపాలిటిల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర..

* నేడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి వివేక్ వెంకటస్వామి..

* నేడు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీష్‌రావు ఆధ్వర్యంలో కీలక భేటీ.. విచారణ కంటే ముందు కేటీఆర్‌, ఎమ్మెల్యేలతో హరీష్‌రావు సమావేశం.. తెలంగాణ భవన్‌ నుంచి విచారణకు వెళ్లనున్న హరీష్‌ రావు..

* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ రావాలని హరీష్ రావుకు సిట్ నోటీసులు.. ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసులు.. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా హరీష్ రావుకి నోటీసులు..

* నేడు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో రెలే దీక్షలు.. కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రిలే దీక్షలు..

* నేడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన కార్యకర్తల భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ క్యాడర్ కు దిశానిర్దేశం..

* నేడు నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతల సమావేశం.. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. హాజరుకానున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు..

* నేడు ఉదయం 11 గంటలకి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం.. ప్రమాణస్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోడీ..

Exit mobile version