Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు మంత్రులు, HoDలు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. వర్చువల్ గా హాజరుకానున్న జిల్లా కలెక్టర్లు.. ఇవాళ ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలో సమావేశం.. 2047 విజన్ లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్..

* నేడు పల్నాడు జిల్లాలో పలువురు మంత్రులు పర్యటన.. గురజాల నియోజకవర్గంలో రూ. 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. పాల్గొననున్న మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

* నేడు అమరావతి మండలం కర్లపూడిలో రాజధానికి రెండో విడత భూ సమీకరణ కోసం గ్రామసభ, పాల్గొననున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్..

* నేడు ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు.. రెండవ రోజు జాతీయ స్థాయిలో కేరళ తరహా డ్రాగన్ పడవల పోటీలు.. ఆత్రేయపురం వద్ద గోదావరి డెల్టా ప్రధాన కాలువలో పడవల పోటీలు కనువిందు.. పోటీల్లో పాల్గొంటున్న ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల క్రీడాకారులు..

* నేడు పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. వాదనలు వినిపించేందుకు సిద్ధమైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. విచారణ చేపట్టనున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. గత విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి ప్రయత్నించాలన్న సీజే.. కేసుపై మూడు పరిష్కారాలు సూచించిన సుప్రీంకోర్టు.. సివిల్ సూట్ చేయాలని తెలంగాణ సర్కార్ కు సూచన..

* నేటి నుంచి ఈ నెల 148 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో విద్యుత్ కాంతులు.. ప్రధాన ఆలయం గోపురాలు, పురవీధులు, మాడ వీధులతో విద్యుత్ కాంతులు.. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న శ్రీస్వామి, అమ్మవారి ఆకృతులు, పరివార ఆలయాలు..

నేడు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..

* నేడు అహ్మదాబాద్ కు జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్.. ప్రధాని మోడీతో భేటీకానున్న ఫ్రెడ్రిక్ మెర్జ్..

* నేడు శ్రీహరికోట నుంచి PSLV-C2 రాకెట్ ప్రయోగం.. ఉదయం 10: 17 గంటలకు PSLV-C2 మిషన్ ను ప్రయోగించనున్న ఇస్రో..

* నేడు డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య పోటీ.. ముంబై వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్.. రాత్రి 7: 30 గంటలకి మ్యాచ్..

Exit mobile version