అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4:50 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్న జగన్.. రాత్రి 7:10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. రాత్రి 7.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,56,554 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. ప్రస్తుతం : 872.50 అడుగులు. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు. ప్రస్తుతం : 152.4941 టీఎంసీలు. కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్‌పైనా నేడు తీర్పు ఇవ్వనున్న ఏసీపీ కోర్టు. లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,290 లు గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,410 లుగా ఉంది. అలాగే. కిలో వెండి ధర రూ.1,17,700 లుగా ఉంది.
అమరావతి : ఇవాళ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల దాఖలు,పరిశీలన, ఉపసంహరణ. ఎన్నికల అబ్జర్వర్ గా పీసీ మోహన్ (కర్నాటక ఎంపీ). ఎన్నికల అధికారిగా రాజ్యసభ సభ్యులు పాకావెంకట సత్యనారాయణ. ఉదయం 11గంటలకు నుండి 1గంటల వరకు నామినేషన్లు స్వీకరణ. నామినేషన్ పత్రాల పరిశీలన 1గంటల నుండి 2గంటల వరకు. ఉపసంహరణ… 2గంటల నుండి 4గంటల వరకు.
బాపట్ల : ఇవాళ జిల్లాలో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. ఉదయం10 గంటలకు పంగులూరు వ్యవసాయ మార్కెట్లో యార్డులో బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.. ఉదయం 11:30 గంటలకు ఇంకొల్లులో మార్కెట్ యార్డ్ లోని బర్లీ కొనుగోలు కేంద్రాన్ని మంత్రులతో కలిసి ప్రారంభిస్తారు.. మధ్యాహ్నం1.30 గంటలకు పర్చూరు స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కొనుగోలు తీరును పరిశీలించి రైతులతో ముచ్చటిస్తారు..
అమరావతి: ఇవాళ విజయవాడలో క్వామ్ టమ్ వేలీ వర్క్ షాప్. దిగ్గజ కంపెనీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఉదయం 11 గంటలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు.. ఐబీఎం..టీసీఎస్.. మైక్రోసాఫ్ట్ ఇండియా. వార్నర్ బ్రదర్స్..ఇండియా ఇన్నోవేషన్ వంటి దిగ్గజ సంస్థలు హాజరు. అమరావతి లో త్వరలో క్వామ్ టమ్ వేలీ పార్క్ ఏర్పాటు. అత్యుత్తమ డేటా.. కొత్త టెక్నాలజి..వాతావరణ మార్పులు పై అధ్యయనం.ఇలా వివిధ అంశాలపై క్వామ్ టమ్ ఫోకస్. ఇవాళ భారీ వర్క్ షాప్…ఏపీ లో క్వామ్ టమ్. వేలీ పై దిశా నిర్దేశం..
తెలంగాణ లో నెమ్మదిగా వేగం పుంజుకుంటున్న నైరుతి ఋతుపవనాలు. ఈ క్రమంలో నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఈ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నట్టు తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల దాఖలు,పరిశీలన, ఉపసంహరణ. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నామినేషన్లు స్వీకరణ. సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఎన్నిక ప్రక్రియ. రేపు నూతన అధ్యక్షుడి ప్రకటన.
