నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీలో పాల్గొననున్న చంద్రబాబు. రెండు రోజుల పాటు గుంటూరులోనే చంద్రబాబు పర్యటన.
నేడు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికకు సీఎం రేవంత్. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న హీరో రామ్‌చరణ్.
రాజమండ్రిలో కేంద్రమంత్రి షెకావత్, పవన్ పర్యటన. నేడు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న పురంధేశ్వరి.
నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి కేసులో పిటిషన్ దాఖలు చేసిన జగన్.
విజయవాడలో నేటి నుంచి పర్యాటక కాన్‌క్లేవ్. పర్యాటకంలో భారీ పెట్టుబడులు లక్ష్యంగా కాన్‌క్లేవ్. ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకోనున్న 55కి పైగా సంస్థలు. రూ.10,039 కోట్ల పెట్టుబడులకు సంస్థల సుముఖత. కాన్‌క్లేవ్‌కు రేపు హాజరుకానున్న సీఎం చంద్రబాబు.
ఆదిలాబాద్‌లో జిల్లాలో నేడు మంత్రి జూపల్లి పర్యటన. ఇన్‌చార్జ్ మంత్రిగా తొలిసారి ఆదిలాబాద్‌కు జూపల్లి. వర్గపోరు, గ్రూప్‌ల విషయంపై కార్యకర్తలతో సమావేశం.
ఏపీ లిక్కర్ కేసులో కొనసాగుతున్న విచారణ. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీ పిటిషన్లపై నేడు విచారించనున్న న్యాయస్థానం. నిందితుల బెయిల్ పిటిషన్లపైనా విచారించనున్న కోర్టు.
నేడు తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న అధికారులు.
నేడు ఏపీలో డీఈఈసెట్ ఫలితాలు విడుదల. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న అధికారులు.
దివ్యాంగులకు రేషన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచే రేషన్. నాలుగు రోజులు ముందుగానే జూలై నెల రేషన్. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా డోర్ డెలవరీ.
నేడు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పిటిషన్ కమిటీ సమావేశం. డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో కమిటీ సమావేశం. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
హైదరాబాద్: నేటి నుంచి ఆషాడ మాసం బోనాలు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం.
విజయవాడ: నేటి నుంచి 4వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు. నేటి నుంచి జూలై 24 వరకు అమ్మవారి ఆషాడ మాస సారె సమర్పణ ఉత్సవాలు.
