Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు సుప్రీంలో అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ. బెయిల్‌ పిటిషన్‌ విచారించేలా హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ను ఆదేశించాలని వినతి. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్‌ రెడ్డి. తల్లి అనారోగ్యం వల్ల వారం పాటు రాలేనన్న అవినాష్‌ రెడ్డి. తన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్‌ వినే వరకు సీబీఐ అరెస్ట్‌ చేయవద్దన్న అవినాష్ రెడ్డి.

2. నేడు ఐపీఎల్‌లో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌. గుజరాత్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటల మ్యాచ్‌ ప్రారంభం.

3. నేడు నీతి ఆయోగ్ సమావేశంపై సీఎం జగన్‌ సమీక్ష. ఈ నెల 27న ఢిల్లో నీతి ఆయోగ్‌ సమావేశం. మాట్లాడాల్సిన అంశాలపై చర్చించనున్న సీఎం.

4. నేటి నుంచి రూ.2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభం. రోజుకు రూ.20 వేల చొప్పున మార్పిడికి అవకాశం. సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఇచ్చిన ఆర్బీఐ.

5. నేడు మమతా బెనర్జీతో భేటీకానున్న కేజ్రీవాల్‌. ఢిల్లీ పాలనా వ్యవహారంలో కేంద్రం జోక్యంపై చర్చ.

6. నేడు గుంటూరులో సీఎం జగన్‌ పర్యటన. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం జగన్‌.

7. తెలంగాణ గ్రామపంచాయతీలకు శుభవార్త. నేడు గ్రామపంచాయతీలకు పెండింగ్‌ బిల్లుల విడుదల. అన్ని పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయనున్న ప్రభుత్వం.

8. నేడు చైన్నైలో నటులు శరత్‌బాబు అంత్యక్రియలు. శరత్‌బాబు మృతికి సీనీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.

Exit mobile version