నేడు బాపట్ల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన. సూర్యలంక దగ్గర అటవీశాఖ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ. అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేక భేటీ. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్న పవన్.
తిరుమల: 22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,086 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 28,239 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.56 కోట్లు.
తిరుపతి : నగరంలో నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. మధ్యాహ్నం హైదరాబాదు నుండి తిరుపతి రానున్న కేంద్రమంత్రి. విమానాశ్రయం నుండి తిరుమల పయనం..
కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ చింతాబసప్పతాత గారి 126 వ సంవత్సర ఆరాధన మహోత్సవం.
నంద్యాల: నేడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో సీపీఎం ధర్నా.. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిశీలించి రైతులకు నష్టాపరిహారం చెల్లించాలని డిమాండ్.
అనకాపల్లి జిల్లా: నేడు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైసీపీ బృందం.. మాకవరపాలెం దగ్గర నిర్మాణం మధ్యలో ఆగిపోయిన మెడికల్ కాలేజ్.. PPP విధానంలో పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయించిన ప్రభుత్వం.
అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణంలో పర్యటించనున్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, రాంప్రసాద్ రెడ్డి…
అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి 11.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.15 గంటలకు విమానంలో బయలుదేరి 2 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2.40 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ కలెక్టర్ పేరిట కొత్త నెంబర్ తో ఫేక్ వాట్సప్ క్రియేటివ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రిక్వెస్ట్ లకు స్పందించవద్దు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 97 మి.మీ వర్షపాతం నమోదు. నిర్మల్ జిల్లా కుబీర్ లో 72.5 మి.మీ.
