అమరావతి: నేడు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం. పార్టీనేతలతో భేటీ కానున్న వైసీపీ అధినేత జగన్. తాజా రాజకీయ అంశాలపై జగన్ సమాలోచనలు.
విశాఖ: నేడు అరుకు, విశాఖలో మంత్రి మనోహర్ పర్యటన. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష. బియ్యం ఎగుమతులపై పోర్టు అధికారులతో సమావేశం.
నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,950 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,400 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,23,000 లుగా ఉంది.
నేడు, రేపు తెలంగాణకు వర్ష సూచన. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు. తెలంగాణలో 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
తెలంగాణలో పీఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు. కన్వీనర్ కోటా కింద 956 మంది విద్యార్థులకు సీట్లు. నేటి నుంచి సర్టిఫికెట్లు సమర్పించాలన్న అధికారులు. తెలంగాణలో ఫీజుల నిర్ణయానికి 4 సబ్ కమిటీలు. ఇంజినీరింగ్, వృతి విద్యా కాలేజీల్లో ఫీజులపై విధివిధానాలను రూపొందించనున్న కమిటీలు.
గుంటూరు : నేడు గుంటూరులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పర్యటన. ఛాయ్ పే చర్చ, బీజేపీ కార్యకర్తల సమావేశం, అమరావతి జేఏసీ నాయకులతో సమావేశం, ఏపీ అర్చక జేఏసీ నేతలతో సమావేశంలో పాల్గొనున్న మాధవ్.
తిరుమల: ఇవాళ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. మూడు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.
