NTV Telugu Site icon

Marriage Dates: పెళ్లి ముహూర్తాలు షురూ.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తేదీలు ఇవే..

Marriage Dates

Marriage Dates

Marriage Dates: ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవడానికి వరుడు, వధువు బంధుమిత్రులతో పాటుగా శుభముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈనెల (అక్టోబర్) 5 నుంచే వివాహానికి శుభ ఘడియలు మొదలయ్యాయి. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఈ మూడునెలల (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదేళ్లలో మూడు జిల్లాల్లో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చే మూడు నెలల్లో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్ల నిర్వాహకులు చెబతున్నారు. ఇక అడ్వాన్స్‌ బుకింగ్‌ లు కూడా పెరిగాయని అంటున్నారు. ఈనెల (అక్టోబర్) పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని రాష్ట్ర అర్చక సంఘం కన్వీనర్‌ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు తెలిపడంతో పెళ్లిళ్ల సన్నాహాలు మొదలుపెట్టేశారు.

Read also: Priya Bhavani Shankar : నా బాడీ వస్తువేం కాదు.. అందాలు చూపించి అవకాశాలు అందుకోవడానికి

దీంతో అక్టోబర్‌ నెల రాకముందు నుంచే వివాహం కోసం ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్లకు బుకింగ్‌లు మొదలయ్యాయి. అక్టోబరు 12,13,16,20,27 కాగా.. నవంబర్‌లో 3,,7,8,9,10,13,14,16,17, ఇక డిసెంబర్‌లో అయితే.. 5,6,7,8,11,12,14,15,26 ఇలా మూడు మాసాల్లో ముహూర్తాల తేదీలు వున్నాయి. అనగా.. ఇలా మూడు మాసాలు కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజా భజంత్రీలు, మండపాలను అలంకరించే వారికి, కేటరింగ్‌ వారికి కూడా ఓ రైంజ్‌ లో ఆర్డర్లు మొదలయ్యాయి. దీంతో దసరా ఉత్సవంతో పాటు శుభకార్యాలకు అనువైన నెల కావడంతో మార్కెట్‌లోనూ సందడి మొదలైంది…. కాగా వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు కూడా భారీగానే పెరిగినట్టు వ్యాపార వర్గాలు తెలుపుతున్నారు. బంగారం ధర పెరిగినప్పటికీ నగలు చేయించుకునేందుకు ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు.
Bathukamma 2024: నేడు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?