Bathukamma 2024: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ, నవవాత్రి ఉత్సవాలు ఘటనంగా కొనసాగుతున్నాయి. ఊరూరా శోభాయమానంగా ఆడపడుచులు అంతా కలిసి కన్నుల పండువగా వేడుకలు జరుపుకుంటారు. మహిళలంతా ముస్తాబయి ఒకే చోట చేరి బతుకమ్మ ఆట పాటలతో ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. కాగా.. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందని పూరాణ గాధ ఉంది.. అందుకని ఇవాళ బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కావున ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. ఇవాళ బతుకమ్మకు నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. దీంతో ఇవాళ ఆడపడచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తారు. ఇక మళ్లీ ఏడోనాడు నుంచి అంగరంగ వైభవంగా బతుకమ్మ కొనసాగుతుంది… కాగా.. దుష్ట సంహారం కోసం నడుం బిగించిన అమ్మవారికి మేమంతా తోడుగా ఉన్నామని మహిళలు అందరూ ఆటపాటలతో.. చప్పట్లతో తోడుగా నిలుస్తారు. ఉత్సాహపరుస్తారు.
Read also: Asaduddin Owaisi: మోడీ ప్రసంగాలు వినే ఉద్దేశ్యం లేకనే నేను పార్లమెంట్ కు వెళ్ళలేదు..
ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్యతో బతుకమ్మ ప్రారంభమవుతుంది. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మకు తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు ప్రత్యేకమైన ప్రసాదం అందిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మలో ప్రత్యేకంగా గౌరమ్మను కూడా తయారుచేస్తారు. ఆడబిడ్డలు ఒకరికొకరు వాయివాయినాలు కూడా ఇచ్చుకుంటారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో వున్న తెలంగాణ వాసులు కూడా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ ఆనందంగా గడుపుకుంటారు.
Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది.. కొనసాగుతున్న బాంబుల వర్షం