Priya Bhavani Shankar : నా బాడీ వస్తువేం కాదు.. అందాలు చూపించి అవకాశాలు అందుకోవడానికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priya Bhavani Shankar : కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన ప్రియా భవానీ శంకర్. ఏ విషయాన్ని అయినా ఆమె ముఖంపై కొట్టినట్లు మాట్లాడతారు. ఈ చెన్నై బ్యూటీ స్కిన్ షోకు దూరంగా ఉంటూనే అవకాశాలను అందుకుంటున్నారు. ఆమె కోలీవుడ్ స్టార్ జీవాతో కలిసి నటించిన బ్లాక్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్లు స్కిన్ షో చేస్తుండటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..చాలా మంది సినిమా రంగంఅంటేనే గ్లామర్ గా ఉండాలని భావిస్తారు. అదే విధంగా అక్కడ క్విడ్ ప్రో కో ఉంటుందని, మంచి చాన్స్ లు రావాలంటే.. దేనీకైన రెడీగా ఉండాలని తరచుగా వార్తలు విన్పిస్తూ ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గ్లామర్‌గా కనిపించడం నాకు అస్సలు నచ్చదు. అలాంటి బోల్డ్ రోల్స్ ని నేను ఒప్పుకోను. కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను.
Read Also:Iran- Israel Conflict: ఇజ్రాయెల్ దెబ్బకి భయపడి గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
అందుకే, నా శరీరాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగా నేను భావించను. అందాలు చూపించి అవకాశాలు అందుకోవాలని అనుకోవడం లేదు. అందుకే, సినిమాల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. అయితే, నెగెటివ్ రోల్ చేయడానికీ కూడా వెనుకాడను. ఎందుకంటే నటన అనేది నా వృత్తి. అలాగే, ఒక హీరోయిన్ గా ఫ్యాషన్ పేరుతో అందాలను మాత్రం ప్రమోట్ చేయలేను’ ’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also:Bathukamma 2024: నేడు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియ భవానీ శంకర్.. తర్వాత తమిళ బుల్లితెరపై సీరియల్స్‌లో చేశారు. ఈ పాపులారిటీతో సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. మేయాద మాన్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియ భవానీ శంకర్ వరుస హిట్స్‌తో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీలు తెలుగులోకి డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో 2023లో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగులో తొలిసారి నటించారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన భీమాలోనూ సందడి చేశారు. దూత వెబ్‌సిరీస్‌లో అక్కినేని నాగచైతన్యకు భార్యగా నటించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!